మంత్రికి కరోనా.. సచివాలయంలో కలకలం! - xorona latest news
15:25 June 28
బిహార్‌లో మంత్రికి కరోనా పాజిటివ్
బిహార్‌లోని వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్‌కు కరోనా సోకింది. ఆయన సతీమణికి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఇరువురూ కాటిహార్లోని ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఆ మంత్రి.. రెండు రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో ఓ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. ఇటీవల ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలోపడ్డారు.
నితీశ్ కుమార్ ప్రభుత్వంలో కరోనా సోకిన తొలి మంత్రి వినోద్ కుమారే. రాష్ట్రంలో అంతకుముందు ఓ ఎమ్మెల్యేకు కూడా కొవిడ్ సోకింది. ఆయన ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు.