తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కరోనాపై అమిత్​ షా ఉన్నత స్థాయి సమీక్ష - అమిత్​ షా తాజా వార్తలు

దిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న క్రమంలో తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్​, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి హర్షవర్ధన్​, దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్​ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. 750 ఐసీయూ పడకల ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు చెప్పారు కేజ్రీవాల్​.

Amit shah meets officers on covid
దిల్లీ కరోనాపై అమిత్​ షా ఉన్నత స్థాయి సమీక్ష

By

Published : Nov 15, 2020, 7:19 PM IST

Updated : Nov 15, 2020, 7:41 PM IST

దిల్లీలో కొద్ది కాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజధానిలో కొవిడ్​-19 తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజల్​, ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​, దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్​, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

దిల్లీలో కరోనా కేసుల పెరుగదలతో ఏర్పడిన పరిస్థితులపై సమీక్షించారు షా. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులలో చర్చించి తగు సూచనలు చేసినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.

" ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలను రెండింతలు చేస్తున్నాం. పరిస్థితులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఐసీఎంఆర్​, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని మొబైల్​ టెస్టింగ్​ వ్యాన్లను మోహరిస్తాం. లక్షణాలు మధ్యస్థంగా ఉన్న వారికి చికిత్స అందించేందుకు కొన్ని ఎంసీడీ ఆసుపత్రులను కొవిడ్​ ఆసుపత్రులుగా మార్చుతాం. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

750 ఐసీయూ పడకలకు కేంద్ర హామీ..

దిల్లీలోని డీఆర్​డీఓ ఆధ్వర్యంలోని కొవిడ్​ ఆసుపత్రుల్లో 750 ఐసీయూ పడకలు ఏర్పాటుకు కేంద్ర భరోసా కల్పించిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. అలాగే.. కరోనా పరీక్షల సంఖ్య రోజుకు 60 వేల నుంచి లక్షకు పెంచబోతున్నట్లు చెప్పారు.

"దిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులపై హోంశాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి సంస్థతో కలిసి పనిచేయటం చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రి అమిత్​ షాకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రస్తుతం ఐసీయూలోని పడకల అంశమే అతిపెద్ద సమస్య. అక్టోబర్​ 20 తర్వాత కరోనా కేసులు పెరగటం వల్ల ఆ సమస్య ఎదురైంది. కరోనా పడకలు ఉన్నా.. ఐసీయూ పడకలు నిండిపోయాయి. డీఆర్​డీఓ ఆసుపత్రుల్లో 500 ఐసీయూ పడకల ఏర్పాటుకు కేంద్ర హామీ ఇచ్చింది. మరో 250 త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఐసీయూ పడకలను పెంచనున్నాం. రోజుకు 15 వేల కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతున్నాం."

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

దిల్లీలో ఆదివారం కొత్తగా 3,235 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 95 మంది మరణించారు. మొత్తం కేసులు 4.85 లక్షలు, మరణాలు 7,614కు చేరాయి. ఐదు నెలల తర్వాత గత బుధవారం అత్యధికంగా ఒక్క రోజు కేసుల్లో 8,598 కేసులు వచ్చాయి. గురవారం 104 మంది చనిపోయారు. ప్రస్తుతం రికవరీ రేటు 89 శాతంగా ఉంది.

ఇదీ చూడండి: దేశంలో కరోనా తగ్గుముఖం- ఈ గణాంకాలే నిదర్శనం!

Last Updated : Nov 15, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details