తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇల్లునే పిచ్చుకల గూడులా మార్చేశాడు!

పిచ్చుకలంటే అతనికి ఎంతో ఇష్టం. తన పురాతన ఇంటిని పక్షులు నివసించేలా మార్చి గత 18 ఏళ్లుగా పిచ్చుకలను సంరక్షిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అతనెవరో కాదు బిహార్​ రోహ్తాస్​ జిల్లాలో 'బర్డ్​మ్యాన్​ ఆఫ్​ రోహ్తాస్​'గా ప్రసిద్ధి చెందిన అర్జున్​ సింగ్​. మరి ఆ కథేంటో తెలుసుకుందాం?

By

Published : Jul 3, 2019, 7:56 PM IST

ఇల్లునే పిచ్చుకల గూడులా మార్చేశాడు!

ఇల్లునే పిచ్చుకల గూడులా మార్చేశాడు!

తన కళ్ల ముందు ఓ పిచ్చుక అనారోగ్యంతో పడిపోవటాన్ని చూసి చలించిపోయాడు బిహార్​కు చెందిన అర్జున్​ సింగ్​. దానిని అక్కున చేర్చుకుని చికిత్స అందించాడు. అప్పుడే.. ఆ క్షణమే అంతరించిపోతున్న చిన్ని పక్షులను కాపాడాలనుకున్నాడు. అందుకోసం తన పురాతన ఇంటి గోడలను పిచ్చుకల గుళ్ల మాదిరిగా రంధ్రాలు చేశాడు. 18 ఏళ్లుగా ఈ పక్షుల సంరక్షణ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద వేల సంఖ్యలో పిచ్చుకలు ఉన్నాయి.

వృత్తి రీత్యా రైతు అయిన సింగ్​ పిచ్చుకల కోసం వరి గింజలు, గోధుమలు ఏర్పాటు చేస్తున్నాడు. రోజులో ఎక్కువ సమయం పక్షులతోనే గడుపుతానంటున్నాడు సింగ్​. వాటికి గింజలు వేస్తూ.. వాటి రాగాలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెబుతున్నాడు.

" ఒక రోజు ఇంటి ముందు కూర్చున్న సమయంలో గాయపడిన పిచ్చుకను చూశాను. దానిని తీసుకువెళ్లి చికిత్స అందించాను. ప్రతి రోజు మంచి ఆహారంతో పాటు చికిత్స అందించటం ద్వారా అది ఆరోగ్యంగా మారింది. దాని వద్దకు మిగతా పిచ్చుకలు రావటం మొదలెట్టాయి. ప్రతి ఏటా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. మా ఇంటి వద్ద గూడు కట్టుకునేవి. వాటి కోసం నీళ్లు, గింజలు ఏర్పాటు చేశాం. గోడల రంధ్రాల లోపల 5x5 సైజు, బయట కేవలం పిచ్చుకలు పట్టే విధంగా తయారు చేశాను. గద్దల వంటి పెద్ద పక్షులు అందులో పట్టవు. దాని ద్వారా అందులో వాటి పిల్లలు, గుడ్లు సురక్షితంగా ఉంటాయి. " - అర్జున్​ సింగ్​, బర్డ్​మ్యాన్​ బిహార్​

బిహార్​ వన్యప్రాణుల సంరక్షణ మండలిలో సభ్యులుగా ఉన్నారు అర్జున్​ సింగ్​. పిచ్చుకల సంరక్షణ చేపడుతున్నందుకు ఆయనకు పలు అవార్డులు వచ్చాయి.

ఇదీ చూడండి: కిరణ్​ బేడీ ట్వీట్​పై లోక్​సభలో గందరగోళం

ABOUT THE AUTHOR

...view details