తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎవరూ లేని వారికి 12 ఏళ్లుగా అన్నీ తానై... - 12 ఏళ్ల నుంచి

కన్నవారినే పట్టించుకోడానికి తీరికలేని నేటి గజిబిజీ జీవితంలో తోటివారికి సాయపడటమే కరవైంది. కానీ అనాథల పాలిట ఓ ఆపన్న హస్తమయ్యాడో మానవతా మూర్తి. మతిస్థిమితం లేనివారికి, అనాథులకు 12 ఏళ్ల నుంచి 'నేనున్నాను' అంటున్నాడు కర్ణాటక వాసి సురేష్.

మతిస్థిమితంలేని వారిపై మానవత్వం చాటిన ఓ వ్యక్తి

By

Published : Sep 28, 2019, 2:50 PM IST

Updated : Oct 2, 2019, 8:43 AM IST

ఎవరూ లేని వారికి 12 ఏళ్లుగా అన్నీ తానై...

కర్ణాటకలోని ఓ వ్యక్తి తన మంచి పనులతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మానసిక ఆరోగ్యంతో బాధపడుతూ అనాథలుగా మారిన వారిని అక్కున చేర్చుకుంటున్నాడు సురేష్​.

ప్రత్యేక రోజుల్లో.. ప్రత్యేక సేవ

చామరాజనగర్​ వద్ద అక్కడి రైల్వేస్టేషన్​ సమీపంలో మతిస్థిమితం లేని అనాథలు నిత్యం కనిపిస్తుంటారు. సక్రమంగా దుస్తులు ధరించకుండా వీధుల్లో తిరుగుతున్న వారిని చూసి చలించిపోయాడు. పన్నెండేళ్ల నుంచి అలాంటి వారిని చేరదీసి.. వారికి స్నానం చేయించి, వస్త్రాలు, ఆహారం అందిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర్య దినోత్సవం, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సం వంటి ప్రత్యేక రోజుల్లో ఇలాంటి మంచి పనులు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వీటితోపాటు మతిస్థిమితం లేని వారిని జాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుతున్నాడు.

ఇదీ చూడండి : బంగారంపై పెట్టుబడులు ప్రస్తుతం మంచివేనా?

Last Updated : Oct 2, 2019, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details