తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెట్రో స్టేషన్​లో రైలు కదలగానే దూకేసింది! - ఆత్మహత్య

దిల్లీ మెట్రోస్టేషన్​లు ఆత్మహత్యలకు అడ్డాగా మారుతున్నాయి. వారం రోజుల్లోనే ఇద్దరు మహిళలు మెట్రో రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. వందలాది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాయి.

మెట్రో స్టేషన్​లో రైలు కదలగానే దూకేసింది!

By

Published : Sep 8, 2019, 11:14 AM IST

Updated : Sep 29, 2019, 8:53 PM IST


దిల్లీ మెట్రో స్టేషన్ల​లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో యువతి మెట్రో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

శనివారం సాయంత్రం మోడల్​టౌన్​ మెట్రో స్టేషన్​లో పహాడ్​ గంజ్​కు చెందిన 25 ఏళ్ల సోనాక్షి గార్గ్ ప్లాట్​ఫాంపైకి వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగింది. మెట్రో రైలు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని కదలగానే ఆమె పట్టాలపైకి దూకేసింది. డ్రైవర్​ ఎమర్జెన్సీ బ్రేక్​ వేసి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే వేగం పుంజుకున్న రైలు... అదుపులోకి రాలేదు. ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ​

సోనాక్షి ఆత్మహత్యతో ఆ మార్గంలో 15 నిమిషాలు మెట్రో సేవలు స్తంభించాయి. వందలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది పడ్డారు.
మృతదేహాన్ని బాబు జగ్జీవన్​ రాం ఆసుపత్రికి చేర్చారు పోలీసులు. ఆమె వద్ద తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని రాసున్న ఓ ఉత్తరం దొరికింది.

"గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ కారణంగానే ఆమె తీవ్ర ఆవేదన​కు లోనైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది" అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆజాద్​పుర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
వారం రోజుల క్రితమే జండేవాలా మెట్రో స్టేషన్​లో ఇలాగే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ చూడండి:'వాళ్లు ఉగ్రవాదులు కాదు.. మా దేశ రైతులు'

Last Updated : Sep 29, 2019, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details