తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టక్కరి ప్రియురాలు.. ఖైదీ కోసం మారువేషంలో జైలుకు!

ఓ హత్య కేసులో నిందితుడైన తన ప్రియుడ్ని కలిసేందుకు తీహార్ జైలుకు వెళ్లిందో ప్రేయసి. ఎన్​జీఓ వాలంటీర్​గా చెప్పుకొని జైల్లోకి చొరబడ్డ ఆమెను అధికారులు సులభంగా లోనికి అనుమతించారు. 4 రోజుల తర్వాత విషయం తెలుసుకొని తలలు పట్టుకున్నారు.

By

Published : Aug 14, 2019, 12:32 PM IST

Updated : Sep 26, 2019, 11:30 PM IST

డార్లింగ్​... నీ కోసం జైల్లోకి వచ్చేశా!

కలిసి నెల కూడా కాలేదు. అయినా అతడంటే ఆమెకు ఎనలేని ఇష్టం ఏర్పడింది. ఎంతంటే హత్య కేసులో జైలుకు వెళ్లిన బాయ్​ఫ్రెండ్​ కోసం తానూ జైలుకు వెళ్లేంత! అవును.. దిల్లీలోని తీహార్​ జైల్లో బందీగా ఉన్నఓ నిందితుడిని కలిసేందుకు అతడి ప్రియురాలు ఎన్​జీఓ వాలంటీర్​ అని చెప్పి చెరసాలలో చొరబడింది.

ప్రియతమా జైల్లో నీవు కుశలమా?

తీహార్ జైల్లో బందీగా ఉన్న ప్రియుడి పట్ల విరహాన్ని తాళలేకపోయింది ప్రేయసి. అధికారుల కళ్లు గప్పి స్వచ్ఛంద సంస్థ వాలంటీర్​గా చెప్పి జైల్లోకి చొరబడింది. జైలు సిబ్బంది కూడా ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తనిఖీ చేయకుండానే జైల్లోకి అనుమతించారు. ఇంకేముంది ప్రేమకు అడ్డేదీ లేదని మురిసిపోయి గంటల తరబడి సమయం గడిపింది. తన ప్రియునికి​ బోర్​ కొడుతుందేమోనని తెగ బాధపడిపోయి రోజూ జైలుకు వెళ్లి కాలక్షేపం చేసింది.

అలా మొదలైంది..

ఆ మహిళకు ముందే పెళ్లయి ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఒంటరిగా ఉంటూ... తోడు కోసం వెతుకుతోంది. మాట్రిమోనియల్​ వెబ్​సైట్​లో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.

హేమంత్​ ఓ హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లాడు. కానీ తాను 'మాట్రిమొనీ' బయోడేటాలో తీహార్ జైలు ఉద్యోగిగా నమోదు చేసుకున్నాడు. జులై 26 పెరోల్​పై వెళ్లి ఆమెను కలిశాడు. అలా ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెరోల్​ గడువు ముగియగానే ఖైదీ నెం. 2 గా తిరిగి జైలుకు వచ్చేశాడు.

ప్రేమను అనుమానించని అధికారులు

ఖైదీ ప్రియురాలు ఇలా జైల్లోకి వస్తూ పోతూ గంటల తరబడి గడుపుతున్నా అధికారులు మాత్రం ఆమెపై ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. 4 రోజులు గడిచాక అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు తెలిశాక తీహార్ జైలు సిబ్బంది, అధికారుల భవితవ్యం తేలనుంది.

ఇదీ చూడండి: హోలీకి 51టన్నుల లడ్డూలు

Last Updated : Sep 26, 2019, 11:30 PM IST

ABOUT THE AUTHOR

...view details