తెలంగాణ

telangana

తొలి ఓటు... తొలి ప్రేమ... రెండూ ఒకటేనట!

By

Published : Oct 20, 2019, 3:21 PM IST

ప్రస్తుత రోజుల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసేందుకు పోలింగ్​ కేంద్రానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. నవతరంలో నూతన ఉత్తేజం నింపి.. ఓటింగ్​లో పాల్గొనేలా చేసేందుకు ముంబయికి చెందిన కొందరు యువకులు నడుం బిగించారు. కుర్రకారును ఆకట్టుకుంటున్న ర్యాప్​ మ్యూజిక్​ను ఇందుకు సాధనంగా ఎంచుకున్నారు.

మేక్​ యువర్​ ప్రజెన్స్

మేక్​ యువర్​ ప్రజెన్స్ బృందం
సంగీతంతో ఓటు ప్రాముఖ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ముంబయికి చెందిన యువకులు. ఇందుకోసం 'ర్యాప్​ మ్యూజిక్​'ను ఎంచుకున్నారు. 'మేక్​ యువర్​ ప్రజెన్స్​' అనే పేరుతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఓటు హక్కు ప్రాముఖ్యం, యువత పాత్రపై పాటల రూపంలో నూతన పద్ధతుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

" సంగీతంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అందుకు ర్యాప్​ను ఒక సాధనంగా ఎంచుకున్నాం. ఆంగ్లం, హిందీ, మరాఠీ భాషల్లో పాడగలిగిన నలుగురు ర్యాపర్లు ఉన్నారు. "

- చైతన్య ప్రభు, బృందం వ్యవస్థాపకుడు

తాము పాడే పాటల్లో ప్రస్తుత తరం ఏం చేస్తోంది, ఎలా ప్రవర్తిస్తోంది, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడటం లేదు అనే అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు ప్రభు. అన్ని పాటల్లో 'పెహ్లా ఓట్​.. పెహ్లా ప్యార్'​ అనేది చాలా ప్రాచుర్యం పొందిందని తెలిపారు.

ఇదీ చూడండి: వైరల్​: పోలీసులను హడలెత్తించిన మొసలి

ABOUT THE AUTHOR

...view details