సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించింది ఉత్తరాఖండ్‌కు చెందిన అంజనా మాలిక్ అనే దివ్యాంగురాలు. రెండు చేతులు లేకపోయినా.. పాదాలతో అద్భుతమైన కాన్వాస్ చిత్రాలను గీస్తూ స్ఫూర్తినిస్తోంది. ఆమె గీసిన చిత్రాలకు వీదేశీ అభిమానులున్నారు.
యాచిస్తూ జీవనం
అంజనా మాలిక్‌కు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. రిషికేష్‌లోని రామ్జుల్లా వంతెన వద్ద యాచిస్తూ వచ్చిన కాస్త సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగించేది.
విధికి ఎదురీది... గళ్లీలో చిత్రకళాకారునిగా అదరగొడుతుంది వీదేశీ మహిళ సూచనతో
ఓ రోజు అంజనా యాచిస్తుండగా... అక్కడికి సందర్శనకు వచ్చిన ఓ అమెరికన్ మహిళ కంట్లో పడింది. అంజనా తన కాళ్లతో ఏదో రాస్తోంది. అది చూసిన ఆ విదేశీ మహిళ ఆశ్చర్యానికి గురైంది. పాదాలతో బాగా రాయగల్గుతున్నావ్ కదా.. అలాగే చిత్రాలనూ గీయొచ్చుగా అని సలహా ఇచ్చింది. ఓ సారి ప్రయత్నించి చూడు అని చెప్పింది. కాన్వాస్ చిత్రాలు గీయటానికి కావాల్సిన రంగులు, ఇతర సామాగ్రిని తెచ్చి ఇచ్చింది. ఆ రోజు పెయింట్ బ్రష్ పట్టిన అంజనా.... ప్రతిరోజు మొక్కవోని దీక్షతో సాధన చేసింది. ఎన్నో అద్భుతమైన కాన్వాస్ చిత్రాలను గీస్తూ అందరి మన్ననలు పొందుతోంది.
ఉత్తరాఖండ్ హరిద్వార్ సందర్శనకు వచ్చిన మన భారతీయులతో పాటు విదేశీయులంతా ఆమె కాన్వాస్ పెయింట్స్‌కు మంత్ర ముగ్ధులైపోతున్నారు. ఒక్కో చిత్రాన్ని రూ.5 నుంచి 7 వేలకు కొనుగోలు చేస్తున్నారు.
విధికి ఎదురీది... గళ్లీలో చిత్రకళాకారునిగా అదరగొడుతుంది ఇదీ చూడండి : మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. డిసెంబరు 11న ముహూర్తం