తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర: భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి - maharastra building collapse

A five storey building collapsed in Mahad, 47 families stranded
మహారాష్ట్రలో కూలిన ఐదంతస్తుల భవనం

By

Published : Aug 24, 2020, 7:22 PM IST

Updated : Aug 25, 2020, 7:11 AM IST

07:06 August 25

ఇద్దరు మృతి...

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌ ప్రాంతంలో సోమవారం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా 18 మంది చిక్కుకున్నట్లు సమాచారం. సాధ్యమైనంత వేగంగా వారందరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తెలిపాయి.

23:12 August 24

ఒకరు మృతి...

మహారాష్ట్ర మహాడ్​లో భవనం కూలిన ఘటనలో ఒకరు మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. మరో ఏడుగురు గాయపడినట్టు వివరించారు. సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు.

21:49 August 24

17 మందికి గాయాలు..

మహాడ్​లో భవనం కూలిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మొత్తం 70 ఉన్నట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు అధికారులు. ఈ ప్రమాదం రాత్రి 7 గంటలకు జరిగినట్లు వెల్లడించారు. 

ఈ భవనంలో మొత్తం 45 ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 25 మందిని రక్షించారు ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది. జిల్లా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.  

21:01 August 24

అన్ని రకాలుగా ఆదుకుంటాం..

మహద్​లో భవనం కూలిన ఘటనపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అన్ని రకాలుగా సాయం అందిస్తామని తెలిపారు.  

"రాయ్​గఢ్​లో ఐదొంతస్తుల భవనం కూలిపోవటం విచారకరం. ఎన్​డీఆర్​ఆఫ్​ డైరెక్టర్ జనరల్​తో ఇప్పుడే మాట్లాడాను. వీలైనంత త్వరగా అవసరమైన సాయం అందిస్తాం. సహాయక చర్యలను ముమ్మరం చేస్తాం. అందరూ క్షేమంగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నా."

- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి  

20:46 August 24

భవన శిథిలాలు

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..

మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మహద్‌ మండలం కజాల్​పురలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా.. దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక సిబ్బంది 25 మందిని కాపాడినట్టు తెలుస్తోంది.  

సోమవారం సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ప్రత్యేక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముంబయి నుంచి ఘటనా స్థలానికి బయల్దేరాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కూలిన ఈ భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నట్టు సమాచారం. ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళి దట్టంగా అలముకొంది.  

వానలతోనే..

భారీ వర్షాల కారణంగానే ఈ భవనం కుప్పకూలినట్టు అధికారులు భావిస్తున్నారు. గత నెలలో కూడా కురిసిన భారీ వర్షాలకు ముంబయిలో ఓ బహుళ అంతస్తుల భవనం కూలడం వల్ల తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురు గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.

20:12 August 24

శిథిలాల కింద 50 మంది..

భవనం కూలిన ఘటనలో ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద 50 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. 

19:53 August 24

శిథిలాల కింద 200 మంది..

మహారాష్ట్ర రాయ్​గఢ్​ జిల్లా మహాడ్​లో భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద 200 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని రక్షించినట్లు మహారాష్ట్ర మంత్రి అదితి తెలిపారు. 

19:18 August 24

మహారాష్ట్రలో కూలిన ఐదంతస్తుల భవనం

మహారాష్ట్రలోని మహాాడ్​లో ఐదంతస్తుల భవనం కూలింది. భవనంలో 47 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. 

Last Updated : Aug 25, 2020, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details