హెచ్ఐవీ, క్యాన్సర్కు ఔషధం కనుగొన్న రైతు! కర్ణాటక చామరాజనగర్ జిల్లా హెగ్గవదిపురకు చెందిన ఓ సాధారణ రైతు మహేశ్ కుమార్. హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు గత ఎనిమిదేళ్లుగా వైద్యం అందిస్తున్నాడు.
హనుమపల చెట్టు ఆకులు, వేర్లతో తానే ఓ ఔషధాన్ని కనుగొన్నాడు మహేశ్. వీటి ద్వారా ఎంతో మంది రోగులకు వ్యాధి నయమైందని చెప్పాడు. తెల్లరక్తకణాల లేమితో బాధపడేవారు ఈ ఔషధం తీసుకుంటే వాటి సంఖ్య పెరుగుతుందని తెలిపాడు.
జిల్లా అధికారులు, ఆయుర్వేద వైద్యులు హనుమల చెట్టు ఆకులు, వేర్లపై పరిశోధనలు జరిపి ఈ ఔషధాన్ని అందరికి చేరేలా చూడాలని విన్నవిస్తున్నాడు మహేశ్.
తన వైద్యానికి రోగుల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా సమాజ సేవ చేస్తున్నాడు మహేశ్.
"నాలుగు లీటర్ల నీటిలో 16 హనుమపల ఆకులు, కొన్ని వేర్లను వేసి..నీటి పరిమాణం 1 లీటరు చేరే వరకు మరిగించాలి. ఈ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం 50 మిల్లీలీటర్ల చొప్పున 80 రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరంలోని క్యాన్సర్ కారక కణజాలాలు అంతరించిపోతాయి. - మహేశ్, రైతు
ఇదీ చూడండి: మహిళలను వివస్త్రల్ని చేసి పోలీసుల అమానుషం!