తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ.. బోర్​ కొట్టి బావి తవ్వేశాడు

​లాక్​డౌన్ వేళ పనిలేదని ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకుండా.. కర్ణాటకలో ఓ రైతు అద్భుతం సృష్టించాడు. ఇరవై రోజుల్లో 40 అడుగుల లోతు బావి తవ్వేశాడు.

A farmer converted lockdown days as useful days
లాక్​డౌన్​ వేళ.. టైంపాస్​ కోసం బావి తవ్వేశాడు

By

Published : May 22, 2020, 12:17 PM IST

లాక్​డౌన్​ వేళ.. బోర్​ కొట్టి బావి తవ్వేశాడు

లాక్​డౌన్​ వేళ ఇంట్లో కూర్చుని ఏం చేయాలో తోచక.. ఓ రైతు బావిని తవ్వేశాడు. యావత్​ ప్రపంచం లాక్​డౌన్​ పట్ల అసహనం వ్యక్తం చేస్తుంటే.. కర్ణాటక మంగళూరుకు చెందిన నోనయ్య పూజారి మాత్రం.. ఎంచక్కా లాక్​డౌన్​ను తనకు అనుకూలంగా మల్చుకున్నాడు.

బాంత్వాల్​ తాలూకా పొర్సపాలుకు చెందిన నోనయ్యకు కొంత పొలం ఉంది. గతేడాది అందులో వేరుసెనగ పంట వేయగా.. అది కాస్తా నీరు లేక ఎండిపోయింది. పొలంలో ఓ బావి తవ్విస్తే.. సాగు చేసుకోవచ్చనుకున్నాడు. కూలీలను మాట్లాడేందుకు వెళ్తే కరోనా భయంతో ఎవ్వరూ రాలేదు.

బావిని తవ్వుతున్న రైతు నోనయ్య

లాక్​డౌన్​ వేళ ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి.. తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి తానే బావి తవ్వడం ప్రారంభించాడు. ఏప్రిల్​ 25 నుంచి మే 16 వరకు 40 అడుగుల మేర గొయ్యి తవ్వేశాడు. లాక్​డౌన్​ వేళ సమయం వృథా చేయకుండా.. మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన నోనయ్య శ్రమకు మెచ్చి.. నేలమ్మ నీళ్లు వదిలింది.

ఇదీ చదవండి:కరోనా సోకింది.. బిర్యానీపై మనసు లాగింది!

ABOUT THE AUTHOR

...view details