తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెడ లోతు నదిని దాటొచ్చి పాఠాలు చెప్పే టీచర్​!

మహిళలు సహన మూర్తులు మాత్రమే కాదు.. వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేందుకు సాహసికులు అవుతారని నిరూపించింది ఓ ఉపాధ్యాయురాలు. ఒడిశాకు చెందిన వినోదిని సమల్​ అనే టీచర్​.. ప్రతి రోజూ మెడలోతు నీటి ప్రవాహానికి ఎదురు నడుస్తోంది. వృత్తి పట్ల ఆమె నిబద్ధతకు ప్రశంసలు వస్తున్నాయి.

మెడ లోతు నదిని దాటొచ్చి పాఠాలు చెప్పే టీచర్​!

By

Published : Sep 13, 2019, 5:41 AM IST

Updated : Sep 30, 2019, 10:15 AM IST

మెడ లోతు నదిని దాటొచ్చి పాఠాలు చెప్పే టీచర్​!
ఒడిశా డెంకానల్​లో వినోదిని సమల్ అనే ఉపాధ్యాయురాలు​ బడిని చేరేందుకు నిత్యం మెడలోతు నీటి ప్రవాహానికి ఎదురు నడుస్తోంది.

ఒడపాడలో రాతియపాలా ప్రాథమిక పాఠశాలలో పదేళ్లుగా ఒప్పంద ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది వినోదిని. ఆమె పాఠశాలకు రావాలంటే ప్రతిరోజూ సపువా నదిని దాటాల్సి ఉంటుంది. నాలుగు అడుగుల లోతులో నదీ ప్రవాహానికి ఎదురు నడవాల్సి వస్తుంది. అయినా ఏనాడు వెనక్కు తగ్గలేదామె. విద్యార్థులకు పాఠాలు చెప్పాలనే తపనతో సాహసవనితలా నదిని అవలీలగా దాటేయడం అలవాటు చేసుకుంది.

ఐదు పదుల వయసున్నా.. ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదన్నదే ఆమె సిద్ధాంతం. పిల్లల భవిష్యత్తే ఆమెకు ముఖ్యం. అందుకే వృత్తి పట్ల చూపే నిబద్ధతకు సలాం చెబుతూ.. ఆమె అంకితభావానికి గులాం అవుతున్నారు స్థానికులు.

ఇదీ చూడండి:'బామ్మ స్పెషల్'​: రూపాయికే నాలుగు ఇడ్లీలు

Last Updated : Sep 30, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details