తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రగ్స్​ వద్దన్నాడని.. తండ్రినే హతమార్చిన తనయ! - DRUGS

మాదక ద్రవ్యాలకు బానిసైందని వారించిన తండ్రినే హతమార్చిందో యువతి. వస్త్ర వ్యాపారి జయకుమార్​(41) నిద్రిస్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటక రాజాజీనగర్​లో జరిగిందీ ఘటన.

డ్రగ్స్​ వద్దన్నాడని.. తండ్రినే హతమార్చిన తనయ!

By

Published : Aug 19, 2019, 1:55 PM IST

Updated : Sep 27, 2019, 12:38 PM IST

విలాసవంత జీవనం.. మాదక ద్రవ్యాలంటే మహా ఇష్టం.. అడ్డేదీ లేదనుకుంది.. సరిగ్గా ఇదే సమయంలో డ్రగ్స్​ సేవిస్తూ తండ్రి కంటపడింది. వద్దని వారించాడు. ఆమె విలాసాలకు అడ్డుతగిలాడు. అంతే.. జన్మనిచ్చిన తండ్రినే సజీవ దహనం చేసిందా తనయ. వినడానికే భయానకంగా ఉన్న ఘటన కర్ణాటకలో జరిగింది.

బెంగళూరు రాజాజీనగర్​లో ఉంటారు వస్త్రవ్యాపారి జయకుమార్​. భాష్యం సర్కిల్​లోని తన నివాసం ఐదో అంతస్తులో విగతజీవిగా పడి ఉన్నారు. కూతురు ఉన్నతి స్వల్పంగా కాలిన గాయాలతో పడి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనా సమయంలో జయకుమార్​ భార్య.. వేరే పని నిమిత్తం పాండిచ్చేరిలో ఉన్నారు.

ఇదీ చూడండి:ముళ్ల పొదల్లో శిశువు- ఈ పాపం ఎవరిది..?

నిప్పంటించిందా..?

ఆగస్టు 17న రాత్రి తన కూతురు డ్రగ్స్​ సేవించిందన్న కారణంతో.. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జయకుమార్​ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తురాలైన ఉన్నతి... తండ్రి పడుకున్న సమయంలో నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. మంటలు అంటుకుని ఆమెకూ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు

Last Updated : Sep 27, 2019, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details