తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బావిలో పడిన మొసలి.. రక్షించిన అటవీశాఖ - belgam

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో చిక్కుకున్న మొసలిని అటవీ శాఖ అధికారులు రక్షించారు. ఈ సంఘటన కర్ణాటక బెల్గాం జిల్లాలోని నాగనౌర్​ గ్రామంలో జరిగింది.

బావిలో పడిన మొసలి.. రక్షించిన అటవీశాఖ

By

Published : Aug 18, 2019, 12:49 PM IST

Updated : Sep 27, 2019, 9:32 AM IST

బావిలో పడిన మొసలి.. రక్షించిన అటవీశాఖ
కర్ణాటక బెల్గాం జిల్లా నాగనౌర్​ గ్రామంలో వేదగంగా నది వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మొసలి వరదలు తగ్గాక వ్యవసాయ బావిలో చిక్కుకుంది. మొసలిని చూసిన గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు క్రేన్​ సాయంతో మొసలిని రక్షించారు.

బావిలోని నీటిలో ఉన్న మొసలిని తీసేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. క్రేన్‌కు అమర్చిన పెద్ద డబ్బాలో కూర్చున్న అటవీ శాఖ సిబ్బంది ఒకరు బావిలోకి వెళ్లి కొద్ది సేపు శ్రమించిన అనంతరం మొసలిని తాడుతో బంధించాడు. తర్వాత దాన్ని బయటకు లాగారు. మొసలిని చూసేందుకు బావి వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు.

మొసలిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి వదలిపెడతామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

ఇదీ చూడండి: 'జుగాడ్​' పవర్​ బ్యాంకులతో వరదల్లో వెలుగులు

Last Updated : Sep 27, 2019, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details