ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు... తల్లిదండ్రులపై చర్యలు తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు బాలల చట్టంలోని సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లోనూ వీరిపై కేసు నమోదైంది.
జీపులో నుంచి పడిన చిన్నారి తల్లిదండ్రులపై కేసు - baby in forest
సృష్టిలో తల్లి ఒడిని మించిన సురక్షితమైన చోటు మరొకటి లేదు ఆ చిన్నారికి. కానీ, అమ్మ ఏమరపాటే తనను అడవిలో ఒంటరిగా పడేసింది. అటవీ శాఖ సాయంతో మళ్లీ ఎలాగోలా మృత్యుంజయురాలై తల్లిని చేరింది. కానీ, ఏ పాపం ఎరుగని పాపాయిని ఇలా ఇబ్బంది పెట్టినందుకు తల్లిదండ్రులపై కేసు నమోదైంది.
జీపులో నుంచి పడిన చిన్నారి తల్లిదండ్రులపై కేసు
Last Updated : Sep 30, 2019, 6:01 AM IST