కరోనా సంక్షోభం ఆర్థిక స్థిరత్వాన్నే కాదు.. మానవ సంబంధాలను దెబ్బతీసింది. ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తేనే భయపడుతూ దూరం పెడుతున్నారు కుటుంబ సభ్యులు. అలాంటిది కొవిడ్ కాలంలోనూ ఇంటింటికీ తిరిగి చికిత్స చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్రకు చెందిన ఓ హోమియోపతి వైద్యుడు. 87 ఏళ్ల వయసులోనూ 10 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్నారు డాక్టర్ రామచంద్ర దణేకర్.
కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం
కొవిడ్ కారణంగా మనుషుల మధ్య దూరం అంతకంతకూ పెరిగిపోతున్న వేళ పేదల ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ వైద్యుడు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలో రోజూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి గ్రామప్రజల బాగోగులు చూస్తున్నారు ఆ డాక్టర్.
కరోనా కాలంలోనూ.. ఇంటింటికీ తిరిగి వైద్యం చేస్తున్నాడీ డాక్టర్
చంద్రపుర్ జిల్లాకు చెందిన రామచంద్ర కనీసం చెప్పులు కూడా వేసుకోరు. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఊరూరా తిరుగుతూ 60 ఏళ్లుగా ఇలానే వైద్య సేవలందిస్తున్నారు. కొవిడ్ కారణంగా పేదలకు చికిత్స చేసేందుకు కొంతమంది వైద్యులు వెనుకడుగు వేస్తున్న తరుణంలో.. నేనున్నానంటూ ధైర్యంతో ముందుకొచ్చి తన వృత్తికి న్యాయం చేస్తున్నారీ డాక్టర్.
ఇదీ చదవండి:దేశంలో 7 లక్షల దిగువకు క్రియాశీల కేసులు
Last Updated : Oct 23, 2020, 5:25 PM IST