తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్ధాలు తిన్న ఓ గజరాజు.. జంబుకండి గ్రామ శివారులో శవమై కనిపించింది.
కొద్ది రోజుల క్రితం కేరళలో గర్భిణి గజం నోటికి గాయమైనట్టే కోయంబత్తూర్ మంగారాయ్ ప్రాంతంలో ఓ 12 ఏళ్ల గజరాజు గాయపడి కనిపించడం చర్చనీయాంశమైంది. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుకు వైద్య పరీక్షలు చేయించారు. కేరళ ఏనుగు తరహాలోనే.. ఈ ఏనుగు నోటికి గాయాలు ఉన్నట్లు గుర్తించారు.