తెలంగాణ

telangana

ETV Bharat / bharat

89లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు - పోలియో చుక్కల వార్తలు

పోలియో నేషనల్​ ఇమ్యునైజేషన్​ డేను పురస్కరించుకుని.. నిర్వహించిన కార్యక్రమంలో 89 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. చుక్కలు వేయించుకోవడానికి వీలుకాని చిన్నారుల కోసం రానున్న 2-5రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయిస్తామని పేర్కొంది.

89 lakh kids below 5 yrs given polio drops across India on 'Polio Ravivar': Health ministry
89లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు

By

Published : Jan 31, 2021, 10:34 PM IST

దేశవ్యాప్తంగా 'పల్స్‌ పోలియో' కార్యక్రమం విజయవంతంగా సాగింది. శనివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం.. పోలియో నేషనల్​ ఇమ్యునైజేషన్​ డేను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో 89లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ కార్యక్రమంలో ఏడు లక్షల బూత్​ల్లో 12 లక్షల మంది సిబ్బంది, 1.8 పర్యవేక్షకులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా ఆంక్షల నడుమ.. కట్టుదిట్టమైన చర్యలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

వీలుపడనవారికి మళ్లీ..

ఈ కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించుకోవడానికి వీలుపడని చిన్నారుల కోసం వచ్చే రెండు నుంచి ఐదురోజుల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయిస్తామని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఏ చిన్నారి.. పోలియో బారిన పడకూడదనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లు, బస్​స్టేషన్లు విమానాశ్రయాల్లో పోలియో బూత్​లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

పక్కదేశాల నుంచి​ ప్రవేశించకుండా..

భారత్​.. గత దశాబ్ద కాలంగా పోలియో రహిత దేశంగా కొనసాగుతోంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్ నుంచి పోలియో దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అధికారులు చర్యలు చేపడతున్నారు. దీనిలో భాగంగా ఏటా పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:ఫిబ్రవరి 13 వరకే రాజ్యసభ కార్యకలాపాలు!

ABOUT THE AUTHOR

...view details