ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల సంఖ్యను కేంద్రం పెంచింది. ఇప్పటికే నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు అదనంగా మరో 80 రైళ్లను నడపనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుండగా... సెప్టెంబర్10 నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి. వాటి వివరాలను, మార్గాలను త్వరలో వెల్లడిస్తామని రైల్వే ప్రకటించింది.
ఏ మార్గాల్లో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటే ఆ మార్గాల్లో రైళ్లను నడుపుతామని అధికారులు వెల్లడించారు. పరీక్షలు, ఇతర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాలు కోరితే ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు.