మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాల్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం రాత్రి ,మురైనా జిల్లాకు చెందిన మాన్పుర్, పహవాలీ గ్రామానికి చెందిన 11 మంది కల్తీ మద్యం తాగడం వల్ల మృతి చెందారు. మరో 8మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా గ్వాలియర్ ఆసుపత్రికి తరలించాం.