ప్రపంచ రికార్డు సాధించిన 70 అడుగుల 'చెత్త గిటారు' ఒడిశా బ్రహ్మపుర ఐటీఐ విద్యార్ధులు వ్యర్థ పదార్థాలతో సృష్టించిన అద్భుత కళాఖండానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. పనికిరాని వ్యర్థాలతో రూపొందించిన 70 అడుగుల గిటార్.. ఇప్పడు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
విపత్తులోంచి వినూత్నం
ఫొని తుపాను తాకిడికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో వస్తువులు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు. ఐటీఐ కళాశాల బ్రహ్మపుర విద్యార్థుల ఆ వ్యర్థాలను ఎలా వినియోగించవచ్చో ఆలోచించారు. వారి చదువుకు ఓ అర్థాన్నిచ్చేలా వ్యర్థాలతో ఆకృతులను నిర్మించాలని పూనుకున్నారు.
కళాశాల ఆవరణని శుభ్రం చేసుకుని పర్యావరణ హిత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకృతుల నిర్మాణాలపై పరిశోధనలు చేశారు. కళాశాలలో పెయింటర్లు, వెల్డింగ్, ఎలక్ట్రిషియన్, ఫిట్టింగ్, ప్లంబింగ్ల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఇలా ప్రాక్టికల్‌గా తమ నైపుణ్యానికి పదునుపెట్టారు.
ఇంకా... భారీ ఆకారంలో ఉన్న మనిషి, తాబేలు, జిరాఫీ వంటి 70 ఆకృతులను నిర్మించారు. ప్రధానోపాధ్యాయులు రజత్ కుమార్ పాణిగ్రాహి ప్రోత్సాహంతో ఇలా వారి సృజనను ప్రపంచానికి చాటారు. ఫలితంగా.. 70 అడుగుల గిటార్ ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఓ పేజీని సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి:వన్యప్రాణుల మధ్య విందు అదరహో..!