తెలంగాణ

telangana

ETV Bharat / bharat

18 ఏళ్ల తర్వాత పాక్​ చెర నుంచి విముక్తి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్​కు చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్​ వెళ్లింది. ఈ క్రమంలో పాస్​పోర్ట్​ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఎట్టకేలకు ఔరంగాబాద్​ పోలీసుల సహకారంతో ఆమె స్వస్థలానికి మంగళవారం చేరుకుంది.

By

Published : Jan 27, 2021, 11:45 AM IST

aurangabad, maharashtra, pakistan
18 ఏళ్ల తర్వాత పాక్​ నుంచి విముక్తి

పాస్​పోర్ట్​ లేని కారణంగా పాకిస్థాన్​లో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఓ మహిళ మంగళవారం ఆమె సొంతూరు అయిన ఔరంగబాద్​కు తిరిగివచ్చింది. కుటుంబసభ్యులు, పోలీసులు ఆమెను స్వాగతించారు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు ప్రశాంతంగా ఉందని ఆమె పేర్కొంది.

పుష్పగుచ్ఛంతో హసీనాను స్వాగతిస్తున్న పోలీసులు

అసలు ఏం జరిగింది..

మహారాష్ట్రలోని ఔరంగబాద్​కు చెందిన 65 ఏళ్ల హసీనా బేగమ్​ 18 ఏళ్ల క్రితం ఆమె భర్త బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్​కు వెళ్లింది. లాహోర్​లో ఆమె పాస్​పోర్ట్​ పోగొట్టుకుంది. పాస్​పోర్ట్​ లేని కారణంగా హసీనాకు పాకిస్థాన్ జైలు శిక్ష విధించింది.

ఔరంగాబాద్​ పోలీసుల నివేదిక

హసీనా నిర్దోషి అని రుజువు అవ్వడానికి భారత్​ నుంచి పాకిస్థాన్​ సమాచారం కోరింది. దీనిపై ఔరంగబాద్​ పోలీసులు పాక్​కు వివరాలు వెల్లడించడం వల్ల హసీనాను గత వారం పాక్​ భారత్​కు అప్పగించింది. సిటీ చౌక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆమె పేరున ఇల్లు ఉందని ఔరంగబాద్​ పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. భారత్​కు తిరిగి రావడంలో సహకరించినందుకు ఔరంగబాద్​ పోలీసులకు హసీనా, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి :ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details