దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మంగళవారం వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 65.28 లక్షలకు చేరిందని స్పష్టం చేసింది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 2.70 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. ఇందులో 55 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు, 9 లక్షల మందికిపైగా ఫ్రంట్లైన్ వర్కర్లు అని వెల్లడించింది.
మంగళవారం.. ఉత్తర్ప్రదేశ్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కొనసాగిందని తెలిపింది.