తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాసేపట్లో 'సార్వత్రికం' ఆరో దశ పోలింగ్​ - దిల్లీ

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ కాసేపట్లో మొదలుకానుంది. 7 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు ఓటింగ్​ జరగనుంది. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.

కాసేపట్లో 'సార్వత్రికం' ఆరో దశ పోలింగ్​

By

Published : May 12, 2019, 5:02 AM IST

కాసేపట్లో సార్వత్రిక పోరు

సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్​ ముగిసింది. కాసేపట్లో ఆరో విడత పోలింగ్‌ మొదలుకానుంది. శాంతియుత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా ఇప్పటికే ఈసీ చర్యలు తీసుకుంది.

ఆరో దశలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 59 లోక్​సభ స్థానాలకు నేడు పోలింగ్​ జరగనుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు లక్షా 13 వేల పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉత్తర్​ప్రదేశ్​లో 14, బిహార్​లో 8, హరియాణాలో 10, ఝార్ఖండ్​లో 4, మధ్యప్రదేశ్​లో 8, బంగాల్​లో 8, దిల్లీలో 7 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

కాసేపట్లో 'సార్వత్రికం' ఆరో దశ పోలింగ్​

ఉత్తరప్రదేశ్​లోని 14 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరగనుంది. ప్రధానంగా భాజపా- ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ కూటమి మధ్య పోరు నెలకొంది.

  • సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ అజంగఢ్‌ నుంచి బరిలో ఉన్నారు.కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.
  • ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న 14 నియోజకవర్గాల్లో 2014లో భాజపా 13 చోట్ల నెగ్గింది.
  1. మధ్యప్రదేశ్​ భోపాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, ఇటీవల భాజపాలో చేరిన మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ మధ్య రసవత్తర పోటీ నెలకొంది.
  2. కాంగ్రెస్‌ కంచుకోట గుణ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. మోరేనా లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ థోమర్‌ బరిలో ఉన్నారు.

దిల్లీ పోరు త్రిముఖం...

  • దేశ రాజధాని దిల్లీ పరిధిలోని 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ భాజపా, ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది.
  • దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌, బాక్సింగ్‌లో ఒలింపిక్‌ పతక విజేత విజేందర్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్షవర్థన్‌, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ వంటి ప్రముఖులు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బంగాల్​లో పటిష్ఠ భద్రత...

బంగాల్‌లో 5 జిల్లాల పరిధిలోని 8 నియోజకవర్గాల్లో కాసేపట్లో పోలింగ్‌ జరగనుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా, కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య ఇక్కడ పోటీ నెలకొంది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 770 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి:ఎక్స్​ప్రెస్​ రైల్లో మంటలు- ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details