ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి - ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి
తమిళనాడు నామక్కల్‌లో వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
తమిళనాడు నామక్కల్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్నకారును ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను బిహార్ వాసులుగా గుర్తించినట్లు వెల్లడించారు అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Last Updated : Mar 14, 2020, 3:24 PM IST