అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక 'స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఆరుగురు భారత సంతతి విద్యార్థులు చరిత్ర సృష్టించారు. విజేతలుగా నిలిచి ఒక్కొక్కరు 50 వేల అమెరికన్ డాలర్ల నగదు, బహుమతులు గెలుచుకున్నారు.
565 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ మెగా పోటీలో ఈసారి ఎనిమిది మంది విద్యార్థులు విజేతలుగా నిలవడం విశేషం. అందులో ఆరుగురు భారత సంతతి విద్యార్థులు ఉండటం మరో విశేషం. గత 94 ఏళ్లలో ఇలా ఇద్దరికి మించి గెలవడం ఇదే మొదటిసారి.
విజేతలు వీరే..
- రిషిక్ గంధశ్రీ (13), కాలిఫోర్నియా
- సాకేత్ సుందర్ (13), మేరీలాండ్
- శృతికా పాడి (13), న్యూజెర్సీ
- సోహమ్ సుఖాంకర్ (13), టెక్సాస్
- అభిజయ్ కొడాలి (12), టెక్సాస్
- రోహన్ రాజా (13), టెక్సాస్
- క్రిస్టోఫర్ సెర్రో (13), న్యూజెర్సీ
- ఎరిన్ హోవార్డ్ (14), అలబామా