తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రికార్డు:రూ.2700కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత - 532 kg

పాకిస్థాన్​ నుంచి భారత్​కు అక్రమంగా తరలిస్తున్న 532 కేజీల హెరాయిన్​ను పంజాబ్​ అటారీ సరిహద్దులో పట్టుకున్నారు కస్టమ్స్​ అధికారులు. వీటి విలువ రూ.2700కోట్లు ఉంటుందని అంచనా.

2700కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

By

Published : Jun 30, 2019, 9:12 PM IST

Updated : Jun 30, 2019, 9:22 PM IST

పాకిస్థాన్​ నుంచి భారత్​కు అక్రమంగా తరలిస్తున్న రూ. 2700కోట్లు విలువ చేసే 532 కేజీల హెరాయిన్​ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. పంజాబ్​ అటారీ సరిహద్దు ప్రాంతంలో తనిఖీల్లో భాగంగా ఓ ట్రక్కులో పెద్దమొత్తంలో హెరాయిన్​ను గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించి కశ్మీర్​కు చెందిన స్మగ్లింగ్​ రాకెట్​ సూత్రధారి, అమృత్​సర్​కు ఉప్పు దిగుమతి చేసే వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్రక్కులో వందలాది రాతి ఉప్పు బస్తాల్లో 52 కేజీల మిక్స్​డ్​ నార్కొటిక్​నూ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్​ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టబడడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పులి వేట నుంచి తప్పించుకున్న బైకర్లు

Last Updated : Jun 30, 2019, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details