తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాది​లో పిడుగుల వర్షం - 51 మంది మృతి - బిహార్

బిహార్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో పిడుగుల ధాటికి రెండు రోజుల్లో సుమారు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.  బిహార్​లోని 12 జిల్లాల్లో 39,  ఝార్ఖండ్​లో నాలుగు జిల్లాల్లో 12 మంది మృతి చెందారు.  బిహార్​ వరదల్లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 123కు చేరుకుంది.

ఉత్తరాది​లో పిడుగుల వర్షం - 51 మంది మృతి

By

Published : Jul 25, 2019, 4:59 AM IST

బిహార్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమయింది. వర్షాలకు తోడు పిడుగులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పిడుగుల ధాటికి రెండు రోజుల్లో సుమారు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బిహార్​లో 39 మంది..

బిహార్​లోని 12 జిల్లాల్లో పిడుగులు పడి మొత్తం 39 మంది మరణించారు. జుముయీ జిల్లాలో 8, ఔరంగాబాద్​లో ఏడుగురు, రోహతాస్​లో ముగ్గురు, తూర్పు చంపారన్, భగల్​పుర్​, బంకా​లో నలుగురి చొప్పున, నవాదా, నలంద, కటిహార్​లో ఇద్దరి చొప్పున, ముంగెర్​, అర్వాల్​, గయాలో ఒక్కరి చొప్పున మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయప్డడారు.

వరదల్లో 123 మంది..

బిహార్​ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 123కి చేరింది. గత రెండు రోజుల్లోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు సగటు వర్షపాతం 28.9 మిల్లీమీటర్లుగా నమోదయింది.

ఝార్ఖండ్​లో...

పిడుగులు పడి ఝార్ఖండ్​లోని వివిధ జిల్లాలో మొత్తం 12 మంది మృతి చెందారు. జమ్తారా జిల్లాలో ఆరుగురు మరణించగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా దగ్గరలోని చెరువులో స్నానం చేసి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రామ్​గఢ్ జిల్లాలో మైదానం పక్కన ఉన్న చెట్టుకింద నిలుచుని క్రికెట్​ మ్యాచ్​ చూస్తున్నవారిపై పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పకుర్​, దుమ్కా జిల్లాలో ఇద్దరి చొప్పున మృతి చెందారు.

ఇదీ చూడండి:దావత్ నుంచి బైక్​లపై తిరిగెళ్తూ నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details