తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"50% వీవీప్యాట్​ పేపర్లు లెక్కించాలి" - వీవీప్యాట్​

ఈవీఎంలపై వివాదం చెలరేగుతున్న వేళ వీవీప్యాట్​ పేపర్ల లెక్కింపును పెంచాలని వివిధ పార్టీలు కోరుతున్నాయి.

ఎన్నికల సంఘాన్ని కలిసిన ప్రతిపక్షాలు

By

Published : Feb 5, 2019, 6:55 AM IST

Updated : Feb 5, 2019, 7:25 AM IST

"50% వీవీప్యాట్​ పేపర్లు లెక్కించాలి"
లోక్​సభ ఫలితాలను విడుదల చేసేముందు 50 శాతం వీవీప్యాట్​ పేపర్లను ఈవీఎంలతో సరిచూడాలని కోరుతూ 23 ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్​ సునీల్​ అరోరా, ఎన్నికల కమిషనర్​ అశోక్ లావాసాలను భేటీ అయిన విపక్షాలు ఈవీఎం ట్యాంపరింగ్​పై ఉన్న అనుమానాలను నివృతం చేయాలని విన్నవించాయి. 5 శాతం ఓట్ల తేడా ఉన్న దగ్గర మొత్తం పోలింగ్​ స్టేషన్లలో వీవీప్యాట్​ పేపర్లను లెక్కించి పరిగణలోకి తీసుకోవాలని కోరాయి.

ఈ వినతి పత్రంపై సంతకం చేసిన వారిలో రాహుల్​గాంధీ, శరద్​ పవార్​ లాంటి వారు ఉన్నారు. 23 పార్టీలు కలిపి 69 శాతం ఓటర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతకుముందు ప్రతిపక్ష పార్టీలన్ని ఎన్నికలకు బ్యాలెట్​ను ఉపయోగించాలని డిమాండ్​ చేశాయి. ఈ విధానాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది.

Last Updated : Feb 5, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details