తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో అల్లర్లు.. ఇళ్లు, వాహనాలకు నిప్పు

తమిళనాడు కడలూరులో అలర్లు చెలరేగాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పడవలు, ద్విచక్ర వాహనాలు, ఇళ్లు, కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలతో సంబంధం ఉన్న 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

50-People-Detained-By-Police-After-Violence-In-Tmilnadu-Cuddalore
తమిళనాడులో అల్లర్లు.. ఇళ్లు, వాహనాలకు నిప్పు

By

Published : Aug 2, 2020, 8:31 PM IST

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో పడవలు, ద్విచక్ర వాహనాలు, ఇళ్లు, కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణలతో సంబంధం ఉన్న 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య చాలా రోజులుగా రాజకీయంగా వైరం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో జరిగిన పంచాయితీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం స్థానిక రాజకీయ నాయకుడి సోదరుడిని ప్రత్యర్థి వర్గం హత్య చేసింది. దీంతో సదరు నాయకుడికి చెందిన వ్యక్తులు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇళ్లపై దాడికి దిగినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినట్లు కడలూరు జిల్లా పోలీసు అధికారి ఎం. శ్రీ అభినవ్‌ చెప్పారు.

ఇదీ చూడండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details