తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు, యూపీలో రికార్డు స్థాయిలో కేసులు - కరోనా వైరస్​ తమిళనాడు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరింది. తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో ఆదివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో తాజాగా 4,979 కేసులు బయటపడగా.. ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 2,211 కేసులు వెలుగుచూశాయి.

4,979 new #COVID19 positive cases and 78 deaths have been reported in Tamil Nadu today
తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​లో రికార్టు స్థాయిలో కేసులు

By

Published : Jul 19, 2020, 7:15 PM IST

దేశంలో కరోనా అంతకంతకూ​ విజృంభిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. తాజాగా రికార్డు స్థాయిలో 4,979 కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,254 కేసులు చెన్నైలోనే వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,70,693కు చేరింది. తాజాగా మరో 78 మంది కరోనాతో ప్రాణాలు వీడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,481 మంది మరణించారు. మొత్తం మీద 1,17,915 మంది కరోనాను జయించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో..

ఉత్తర్​ప్రదేశ్​లో ఆదివారం రికార్డు స్థాయిలో 2,211 కేసులు బయటపడ్డాయి. మరో 38మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,247కు చేరగా.. మరణాల సంఖ్య 1,146కు పెరిగింది.

దిల్లీలో...

దిల్లీలో కొత్తగా 1,211కేసులు నమోదయ్యాయి. మరో 31మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశ రాజధానిలో 1,22,793 వైరస్​ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3,628కు చేరింది.

కేరళలో...

కేరళలో తాజాగా 821 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,063 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 5,373 మంది వైరస్​ను జయించారు.

అసోం రాజ్​భవన్​లో...

అసోంలో కరోనా వైరస్​ తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజ్​భవన్​లో కేసులు సంఖ్య అధికమవుతోంది. శనివారం రాత్రి కొత్తగా 27కేసులు బయటపడగా.. మొత్తం మీద 70 కేసులు నమోదయ్యాయి.

అసోం రాజ్​భవన్​ను ఇప్పటికే కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించారు అధికారులు.

రాష్ట్రం కొత్త కేసులు మొత్తం కేసులు
తమిళనాడు 4,979 1,70,693
ఉత్తర్​ప్రదేశ్​ 2,211 49,247
బిహార్​ 1412 26,379
దిల్లీ 1,211 1,22,793
పుదుచ్చేరి 109 1,999

ఇదీ చూడండి-గుడ్​న్యూస్​: దేశంలో తగ్గుతున్న కరోనా సీఎఫ్​ఆర్​

ABOUT THE AUTHOR

...view details