తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2020, 5:18 AM IST

ETV Bharat / bharat

'అందుబాటులో 43వేల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు'

ఆయుష్మాన్​ భారత్ పథకం​ కింద దేశంలో 43 వేలకుపైగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వీటి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

43,022 healthcare centres under Ayushman Bharat operational across country: Health Ministry
అందుబాటులో 43వేల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు

ఆయుష్మాన్​ భారత్ పథకం అమలుపై కీలక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 43,022 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు(హెచ్​డబ్ల్యూసీ) పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నామని తెలిపింది. కరోనా కాలంలోనే(జనవరి నుంచి జులై వరకు) 13,657 హెచ్​డబ్ల్యూహెచ్​సీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.

అసంక్రమిత వ్యాధుల సేవల్లో భేష్​..

ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా జులై 18 నుంచి 24 మధ్య కాలంలోనే 44.26 లక్షల మంది చికిత్స పొందారని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. దేశంలో హెచ్​డబ్ల్యూసీల పనితనానికి ఇదే నిదర్శమని.. కరోనా రహిత సేవలను అందించడంలో హెచ్​డబ్ల్యూసీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వివరించింది. గత వారం రోజుల్లో 3.83 లక్షల రక్తపోటు, 3.14 లక్షల డయాబెటిస్‌, 1.15 లక్షల నోటి క్యాన్సర్‌, 45 వేల రొమ్ము క్యాన్సర్‌, 36 వేల గర్భాశయ క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.

యోగా సెషన్​లు కూడా..

ఆయుష్మాన్​ భారత్​ హెచ్​డబ్ల్యూసీల్లో గతవారం దేశవ్యాప్తంగా 32 వేల యోగా సెషన్​లు నిర్వహించామని పేర్కొంది ఆరోగ్యశాఖ. మొత్తంగా యోగా సెషన్​ల సంఖ్య 14.24 లక్షలకు చేరిందని వివరించింది.

ఇదీ చదవండి:'రక్తంలోని ఆక్సిజన్​ స్థాయిపైనా కరోనా ప్రభావం'

ABOUT THE AUTHOR

...view details