తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంచు కొండలు విరిగిపడి ఐదుగురు జవాన్లు మృతి

కశ్మీర్​లో రెండు వేరువేరు మంచు చరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు సైనికులు మరణించారు. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నియంత్రణ రేఖకు సమీపంలో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

4 soldiers killed by snow avalanche near LoC in north Kashmir
మంచు తుపానులకు నలుగురు జవాన్లు బలి

By

Published : Dec 4, 2019, 12:28 PM IST

Updated : Dec 4, 2019, 12:35 PM IST

ఉత్తర కశ్మీర్​​లోని నియంత్రణరేఖ వెంబడి మంగళవారం రెండు వేరువేరు చోట్ల మంచు చరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత సైన్యం వెల్లడించింది.

కుప్వారా జిల్లాలోని తంగ్ధర్​ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మంచు కొండ విరిగిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు చిక్కుకున్నారు. వీరి మృతదేహాలను బుధవారం వెలికితీసినట్టు వివరించారు అధికారులు.

బందిపొరా జిల్లాలోని దవార్​ ప్రాంతంలో ఇదే తరహా ప్రమాదం సంభవించగా... పదాతి దళంలోని ఇద్దరు మంచులో చిక్కుకున్నారు. ఈ ఘటనలో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి మృతదేహం.. గాలింపు చర్యల్లో భాగంగా లభించింది.

నవంబర్​ 18న ఉత్తర సియాచిన్​లో మంచు చరియల కింద ఎనిమిది మందితో కూడిన జవాన్ల బృందం చిక్కుకుపోయిన ఘటనలో నలుగురు భారత సైనికులు, ఇద్దరు సహాయకులు మృతిచెందారు. గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:- జవాన్ల మధ్య ఘర్షణ- కాల్పుల్లో ఆరుగురు మృతి

Last Updated : Dec 4, 2019, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details