తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగి ఉన్న ట్రక్కుని ఢీకొన్న జీపు.. నలుగురు మృతి - మహారాష్ట్ర ఔరంగా​బాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర ఔరంగాబాద్​లో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఓ జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

4 people have died on the spot and 9 are seriously injured in an accident
మహారాష్ట్ర ఔరంగా​బాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Jan 31, 2020, 11:57 AM IST

Updated : Feb 28, 2020, 3:38 PM IST

ఆగి ఉన్న ట్రక్కుని ఢీకొన్న జీపు.. నలుగురు మృతి

మహారాష్ట్ర ఔరంగా​బాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఓ జీపు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఘాటీ ఆస్పత్రికి తరలించారు.

ఔరంగా​బాద్​- జల్నా మార్గంలో సిందఖేద్​రాజ్​ వైపు వెళ్తున్న క్రమంలో.. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వేగంగా దూసుకొచ్చిన ఓ జీపు రోడ్డు పక్కనే ఆగి ఉన్న ట్రక్కు ట్రాలీని ఢీకొంది. ఈ ఘటనలో కాశీనాథ్​ మేస్త్రీ, రవి జాదవ్​, సంగీత బూందే, హృషిధర్​ టిడ్కే ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:కరోనాకు భారతీయుడు బలి- మలేసియాలో మృతదేహం

Last Updated : Feb 28, 2020, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details