ఛత్తీస్గఢ్ కొరియా జిల్లా దేవగడ్ అటవీ ప్రాంతంలోని ఆంగ్వాహీ గ్రామంలో అడవికి వెళ్లి వస్తున్న స్థానికులపై ఎలుగు బంటి దాడి చేసింది. ఆదివారం సాయత్రం జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అటవీ అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని వివరించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించామన్నారు.
ఎలుగుబంటి దాడిలో నలుగురు మృతి - bear attacked on villagers
ఛత్తీస్గఢ్ కొరియా జిల్లా దేవగడ్ అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడిచేసిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
గ్రామస్థులపై ఎలుగు బంటి దాడి-నలుగురు మృతి
ఈ ఘటనపై కొరియా జిల్లా ఎస్పీ చంద్రమోహన్ సింగ్ స్పందించారు. ఎలుగు బంటి మృతదేహాల వద్ద చాలాసేపు ఉండటం వల్ల సహాయక చర్యలు చేయలేకపోయామన్నారు. మరణించినవారి ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షలు సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి :మరుగుదొడ్లు లేక.. మధ్యాహ్న భోజనానికి దూరంగా!