విధుల్లో ఉన్న ఓ పోలీసుపై నలుగురు దుండగులు దాడిచేసిన ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పాండిబజార్లో కార్తికేయన్ అనే పోలీసు రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు ఓ ట్రాన్స్‌జెండర్‌తో మాట్లాడుతున్నారు. అది గమనించిన కార్తికేయన్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు. మద్యం తాగిన ఆ నలుగురు.. తాము న్యాయవాదులమంటూ పోలీసుపై ఒక్కసారిగా దాడిచేశారు.