మహారాష్ట్ర ముంబయిలో ఉదయం 6.36 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తర ముంబయికి 98 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ మీద 2.7 తీవ్రత నమోదైంది.
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో ఇది మూడో భూకంపం. అంతకుముందు పాల్ఘర్ జిల్లాలో దహను, తలసారి ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు నాసిక్‌లో 2.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి.