తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడో దశ 'సార్వత్రికం' సాగిందిలా...

By

Published : Apr 23, 2019, 6:45 AM IST

Updated : Apr 23, 2019, 6:03 PM IST

మూడో దశ ఎన్నికలు

2019-04-23 17:57:38

మూడో దశలో 61.31 శాతం

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్​ స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంల సమస్య మళ్లీ పునరావృతమైంది. బిహార్​, కేరళలో ఉదయం ఎలక్ట్రానిక్ ఓటింగ్​ యంత్రాలు మొరాయించాయి. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.

ఐదు గంటల వరకు 61.31 శాతం ఓటింగ్​ నమోదైంది. మొత్తం ఓటింగ్​ శాతంపై ఎన్నికల సంఘం స్పష్టతనివ్వాల్సి ఉంది.

5 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతం

  • అసోం: 72.49 %
  • బిహార్​: 54.91 %
  • గోవా: 68.37 %
  • గుజరాత్​: 56.27 %
  • జమ్ము కశ్మీర్​: 11.22%
  • కర్ణాటక: 60.57 %
  • కేరళ: 67.68 %
  • మహారాష్ట్ర: 52.53 %
  • ఒడిశా: 54.18 %
  • త్రిపుర: 69.09 %
  • ఉత్తరప్రదేశ్​: 53.78 %
  • బంగాల్​: 74.57 %
  • ఛత్తీస్​గఢ్​: 59.16%
  • దాద్రా అండ్​ నాగర్​ హవేలి: 56.81%
  • డమన్​ అండ్​ డియు: 64.82 %

2019-04-23 16:58:59

ముగిసిన మూడో దశ సార్వత్రిక ఎన్నికలు...

చెదురుమదురు ఘటనలు మినహా మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 5 గంటల లోపు క్యూలో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్​ శాతంపై కొద్ది గంటల్లో ఎన్నికల సంఘం స్పష్టతనిస్తుంది. 
 

2019-04-23 16:24:07

ఓటే ఫస్టు...

మహారాష్ట్రలో

మహారాష్ట్రలోని పునేలో వివాహానికి ముందు ఓటు వేసిన వధువు.

2019-04-23 16:13:57

జమ్ములో...

జమ్ము కశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతనాగ్​ జిల్లాలోని పోలింగ్​ కేంద్రం వద్ద పీడీపీ మద్దతుదారులు ఓ నాషనల్​ కాన్ఫరెన్స్​(ఎన్​సీ) కార్యకర్తపై బోగస్​ ఓటింగ్​కు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో దాడి చేశారు. 
 

2019-04-23 16:13:35

మూడో విడత సార్వత్రిక ఎన్నికలకు వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతాలు... 

  • అసోం: 62.13 %
  • బిహార్​: 46.94 %
  • గోవా: 57.12 %
  • గుజరాత్​: 49.70 %
  • జమ్ము కశ్మీర్​: 10.64 %
  • కర్మాటక: 49.79% 
  • కేరళ: 54.83 %
  • మహారాష్ట్ర: 44.23 %
  • ఒడిశా: 58.31 %
  • త్రిపుర: 44.66 %
  • ఉత్తరప్రదేశ్​: 46.82 %
  • బంగాల్​: 66.80%
  • ఛత్తీస్​గఢ్​: 55.27%
  • దాద్రా అండ్​ నాగర్​ హవేలి: 56.81%
  • డమన్​ అండ్​ డియు: 54.84%

2019-04-23 16:00:18

3 గంటల వరకు...

జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్​లో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2019-04-23 15:53:09

జమ్ములో మెహబూబా ముఫ్తీ...

బంగాల్​ ముర్షిదాబాద్​లోని రాణీనగర్​ పోలింగ్​ కేంద్రం వద్ద దుండగులు బాంబు దాడి చేశారు. భయంతో ఓటర్లు పరుగులు తీశారు.

2019-04-23 15:48:10

పోలింగ్​ కేంద్రంపై బాంబు దాడి...

పశ్చిమ బెంగాల్​ ముర్షిదాబాద్​లోని పోలింగ్​ కేంద్రం వద్ద అల్లర్లు చెలరేగాయి. కాంగ్రెస్​- తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ వ్యక్తి మరణించాడు.​

2019-04-23 15:19:16

ఘర్షణలో ఒకరు మృతి...

కేరళలో విషాదం చోటుచేసుకుంది. మూడో దశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. మరో వ్యక్తి ఓటు వేసి ఇంటికి చేరుకున్న తర్వాత కన్నుమూశాడు. 
 

2019-04-23 15:07:33

అసోంలో మన్మోహన్​...

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోంలోని డిస్పూర్​లో ఓటేశారు.
 

2019-04-23 14:57:31

ముగ్గురు మృతి...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ ఆహ్మదాబాద్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు.
 

2019-04-23 13:55:45

అరుణ్​ జైట్లీ...

మూడో విడత సార్వత్రిక ఎన్నికలకు వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్​ శాతాలు... 

  • అసోం: 36.74 %
  • బిహార్​: 37.05 %
  • గోవా: 45.78 %
  • గుజరాత్​: 39.34 %
  • జమ్ము కశ్మీర్​: 9.63 %
  • కర్మాటక: 19.17% 
  • కేరళ: 39.89 %
  • మహారాష్ట్ర: 31.99 %
  • ఒడిశా: 32.82 %
  • త్రిపుర: 44.66 %
  • ఉత్తరప్రదేశ్​: 29.76 %
  • బంగాల్​: 52.40%
  • ఛత్తీస్​గఢ్​: 42.97%
  • దాద్రా అండ్​ నాగర్​ హవేలి: 37.20%
  • డమన్​ అండ్​ డియు: 42.99%

2019-04-23 13:53:00

1 గంట వరకు...

మహరాష్ట్రలోని జల్గావ్​లో వయసును లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధ దంపతులు.
 

2019-04-23 13:36:42

వయసును లెక్కచేయం...

గుజరాత్​ షాపూర్​​లో ఓటేసిన భాజపా సీనియర్​ నేత అడ్వాణీ.
 

2019-04-23 13:32:04

అడ్వాణీ ఓటు...

వీవీప్యాట్​ యంత్రంలో దర్శనమిచ్చిన పాము ఓటర్లను భయపెట్టింది. ఈ ఘటన కేరళ కన్నూర్​ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్​ కేంద్రంలో చోటుచేసుకుంది. అధికారులు ఆ పామును తొలగించి ఓటింగ్​ కొనసాగిస్తున్నారు.

 

2019-04-23 13:14:20

వీవీప్యాట్​లో దర్శనమిచ్చిన సర్పం...

ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేష్​ బఘెల్​ దుర్గ్​ ప్రాంతంలోని పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు. ఓటర్లే నిజమైన జడ్జీలని వ్యాఖ్యానించారు.
 

2019-04-23 12:50:14

ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి...

గోవాలోని సంఖలి నియోజకవర్గంలో ఓటు వేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ దంపతులు.
 

2019-04-23 12:33:51

గోవా ముఖ్యమంత్రి ఓటు...

కర్ణాటకలోని ధార్వడ్​లో సోమవారం బిడ్డకు జన్మనిచ్చి తల్లి ఈరోజు ఓటు వేశారు. అదే ప్రాంతంలో ఓ వృద్ధురాలు స్ట్రెచర్​ పై పోలింగ్​ కేంద్రానికి వెళ్లి ఓటేసింది.
 

2019-04-23 12:23:42

మేమూ ఓటేశాం...

ఓటే ముఖ్యం

సీనియర్​ కాంగ్రెస్​ నేత మల్లికార్జన ఖర్గే కర్ణాటకలోని గుల్బర్గాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-23 12:01:05

11 గంటల వరకు...

కేరళలోని కొచ్చిలో మమ్ముట్టి, తిరువనంతపురంలో మోహన్​లాల్​ ఓటు వేశారు.
 

2019-04-23 11:52:12

ఓటేసిన ఖర్గే...

'పదండి ఓటేద్దాం... తరలిరండి ఓటేద్దాం' అంటూ బిహార్​లోని సమస్తిపూర్​ ప్రాంతం మహిళలు ఓటువేయడానికి బయలు దేరారు.
 

2019-04-23 11:35:50

మమ్ముట్టి... మోహన్​లాల్​...

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-23 11:23:56

పదండి ఓటేద్దాం...

పాటలు పాడుకుంటూ ఓటువేసిన మహిళలు

ఉత్తరప్రదేశ్​ మొరాదాబాద్​లోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఎన్నికల అధికారిపై భాజపా కార్యకర్తలు దాడి చేశారు. సమాజ్​వాద్​ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అధికారి కోరుతున్నట్టు ఆరోపించారు.
 

2019-04-23 11:13:25

ఓటేసిన అన్నా హజారే...

గుజరాత్​లోని అరావళి ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకుని వివాహానికి బయలుదేరిన వధువు.
 

2019-04-23 11:09:17

ఎన్నికల అధికారిపై దాడి...

ఛత్తీస్​గఢ్​లో అంగవైకల్యాన్నీ లెక్కచేయకుండా ఓటు వేయడానికి తరలివెళ్తున్న దివ్యాంగులు...
 

2019-04-23 10:58:22

ఓటు వేశాకే వివాహం...

ఓటే ముందు.. ఆ తర్వతే పెళ్లి సందడి

కేరళ తిరువనంతపురంలో ఓటేసిన కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్​.
 

2019-04-23 10:30:02

దివ్యాంగులు సైతం...

ఒడిశాలోని భువనేశ్వర్​లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-23 10:22:37

శశి థరూర్​ ఓటు...

శశి థరూర్​

మూడో దశ సార్వత్రిక ఎన్నికలకు వివిధ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్​ శాతాలు... 

  • అసోం: 12.36 %
  • బిహార్​: 12.60 %
  • గోవా: 2.29 %
  • గుజరాత్​: 1.35 %
  • జమ్ము కశ్మీర్​: 0 %
  • కర్మాటక: 1.75 % 
  • కేరళ: 2.48 %
  • మహారాష్ట్ర: 0.99 %
  • ఒడిశా: 1.32 %
  • త్రిపుర: 1.56 %
  • ఉత్తరప్రదేశ్​: 6.48 %
  • బంగాల్​: 10.97%
  • ఛత్తీస్​గఢ్​: 2.24%
  • దాద్రా అండ్​ నాగర్​ హవేలి: 0%
  • డమన్​ అండ్​ డియు: 5.8%
     

2019-04-23 09:55:54

ఒడిశా సీఎం ఓటు...

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా సతీసమేతంగా ​అహ్మదాబాద్​లోని నారణ్​పురలో ఓటేశారు.
 

2019-04-23 09:39:21

9 గంటల వరకు...

కర్ణాటకవాసి సీఎన్​ నాయక్​... తల్లి కన్నుమూసిన కొద్ది సేపటికే తన భార్యతో కలిసి భవాని నగర్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు.
 

2019-04-23 09:29:33

అమిత్​ షా ఓటు...

గుజరాత్​ రాజ్​కోట్​లోని పోలింగ్​ కేంద్రంలో ఆ రాష్ట్ర​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-23 09:21:23

తీవ్ర విషాదంలోనూ ...

ఓటు వేసిన సీఎన్​ నాయక్​

మూడో దశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సిరా చుక్కను చూపిస్తూ పోలింగ్​ కేంద్రం వద్ద కొంత దూరం నడిచారు. ఆ దృశ్యాలు...
 

2019-04-23 09:14:06

ఓటేసిన గుజరాత్​ సీఎం...

ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడీయాతో మాట్లాడారు. ఓటు హక్కే ప్రజాస్వామ్య శక్తి అని తెలిపారు. ఉగ్రవాదులు ఉపయోగించే ఐఈడీ కన్నా ఓటే ఎంతో శక్తివంతమైందన్నారు. ఓటు హక్కు కుంభమేళా పవిత్ర స్నానాలతో సమానమని వెల్లడించారు.
 

2019-04-23 08:56:06

ప్రధాని ఓటు- పూర్తి దృశ్యాలు...

ప్రధాని ఓటు

ఓటు వేసిన అనంతరం సిరా చుక్కను చూపిస్తూ...
 

2019-04-23 08:48:11

'ఓటు' ప్రజాస్వామ్య శక్తి ...

గుజరాత్​లోని అహ్మదాబాద్​ పోలింగ్​ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 

2019-04-23 08:31:08

ఇదిగో నా ఓటు...

ఓటు వేయడానికి అహ్మదాబాద్​ పోలింగ్​ కేంద్రానికి చేరుకున్నారు ప్రధాని మోదీ. భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ప్రధానికి స్వాగతం పలికారు.
 

2019-04-23 08:27:25

నరేంద్రుడి ఓటు

మహారాష్ట్రలోని బారామతి పోలింగ్​ కేంద్రంలో కుటుంబ సభ్యులతో పాటు నేషనలిస్ట్​ కాంగ్రస్​ నేత సుప్రియా సూలే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

2019-04-23 08:25:39

పోలింగ్​ కేంద్రంలో మోదీ...

గాంధీనగర్​లో తల్లి హీరాబెన్​తో ప్రధాని ఆత్మీయ భేటీ...

2019-04-23 08:22:18

సుప్రియా ఓటు...

కన్నూర్​ జిల్లా పినరయిలో ఓటు వేసేందుకు సామాన్యులతో పాటు క్యూలో నిల్చున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.

2019-04-23 08:05:25

ఆత్మీయ భేటీ....

గుజరాత్​ గాంధీనగర్​లో తల్లి హీరాబెన్​ ఆశీర్వాదం తీసుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. కాసేపట్లో ఆయన అహ్మదాబాద్​లో ఓటు వేయనున్నారు.

2019-04-23 07:54:30

ముఖ్యమంత్రి ఓటు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలింగ్​ కేంద్రాల వద్ద దృశ్యాలు...
 

2019-04-23 07:52:58

అమ్మ ఆశీర్వాదంతో....

బంగాల్​లోని కొట్వాలీలో ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్​ కేంద్రాల బయట బారులు తీరారు. రాష్ట్రంలో  5 స్థానాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.
 

2019-04-23 07:45:42

తరలివస్తున్న ఓటర్లు...

పోలింగ్​ కేంద్రాల వద్ద పరిస్థితి

మూడో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాసేపట్లో గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ఓటు వేయనున్నట్లు తెలిపారు.
 

2019-04-23 07:18:01

పోలింగ్​ కేంద్రాల వద్ద హడావిడి...

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో మూడో దశ సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 117 లోక్​సభ స్థానాలకు 1640 మంది అభ్యర్థుల పోటీపడుతున్నారు. 2 లక్షా 10 వేల పోలింగ్​ కేంద్రాల్లో మెత్తం 18 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

2019-04-23 07:03:45

మోదీ ట్వీట్​...

మరి కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మొదలుకానుంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 117 నియోజకవర్గాల నుంచి మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

మూడో విడత పోలింగ్​ కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 2లక్షల 10 వేలకుపైగా పోలింగ్​ కేంద్రాలు నెలకొల్పింది. మొదటి రెండు విడతల్లో ఈవీఎంలు మొరాయింపు ఎన్నికల సంఘానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈసారి ఈవీఎంలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
 

2019-04-23 06:56:51

మూడో విడత 'సార్వత్రికం' ప్రారంభం

మూడో దశ ఎన్నికలు ప్రారంభం

మరి కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మొదలుకానుంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 117 నియోజకవర్గాల నుంచి మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

మూడో విడత పోలింగ్​ కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 2లక్షల 10 వేలకుపైగా పోలింగ్​ కేంద్రాలు నెలకొల్పింది. మొదటి రెండు విడతల్లో ఈవీఎంలు మొరాయింపు ఎన్నికల సంఘానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈసారి ఈవీఎంలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
 

2019-04-23 06:36:01

కాసేపట్లో...

మూడో దశ ఎన్నికల వివరాలు

మరి కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మొదలుకానుంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 117 నియోజకవర్గాల నుంచి మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 18 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

మూడో విడత పోలింగ్​ కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 2లక్షల 10 వేలకుపైగా పోలింగ్​ కేంద్రాలు నెలకొల్పింది. మొదటి రెండు విడతల్లో ఈవీఎంలు మొరాయింపు ఎన్నికల సంఘానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈసారి ఈవీఎంలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం. నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
 

Last Updated : Apr 23, 2019, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details