మోటార్ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు నిబంధనలు అతిక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశ రాజధాని దిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి.
డ్రైవింగ్ లైసెన్స్ సహా, ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్ వాహనాల చట్టంలో సవరణలు చేసింది కేంద్రం. జులైలో పార్లమెంటు ఆమోదం పొందిన ఈ నూతన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.