ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బిహార్, ఉత్తర్ప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటు ఘటనలు సంభవించి గురువారం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కి పెరిగింది.
బిహార్లో 26మంది...
బిహార్ వ్యాప్తంగా గురువారం వివిధ ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటు ఘటనల్లో 26మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతి పట్ల కేంద్ర హోంమత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.