గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు ప్రణాళిక చేస్తోన్న ఉగ్రమూకల కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు.
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఐసిస్ ముష్కరుల అరెస్ట్ - terror strike in NCR or UP latest news
దేశ రాజధానిలో భారీ ఉగ్రకుట్రకు ప్రణాళికలు చేస్తోన్న తీవ్రవాదుల ప్రయత్నాలను భగ్నం చేశారు దిల్లీ ప్రత్యేక సెల్ పోలీసులు. నిఘావర్గాల హెచ్చరికతో.. దాడులు నిర్వహించి ముగ్గురు ఐసిస్ అనుమానిత సభ్యులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు.
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఐసిస్ ముష్కరుల అరెస్ట్
దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాల హెచ్చరికతో అప్రమత్తమైన దిల్లీ ప్రత్యేక సెల్ పక్కాసమాచారంతో తనిఖీలు నిర్వహించి.. ముగ్గురు ఐసిస్ అనుమానిత సభ్యులను అరెస్ట్ చేసింది.
తనిఖీలు చేపట్టిన క్రమంలో పోలీసులపై ముష్కరులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
అరెస్టయిన వారిలో ఖాజా మోయిదీన్(52), అబ్దుల్ సమద్ (28), సయ్యద్ అలి నవాజ్ (32)గా గుర్తించారు.