తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కథువా కేసులో ముగ్గురికి 25 ఏళ్లు జైలుశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జమ్ముకశ్మీర్​ కథువాలోని 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో పఠాన్​కోట్​ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధరించింది. వీరిలో ప్రధాన నిందితులు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. మరో ముగ్గురికి ఐదేళ్లు చొప్పున జైలు శిక్ష విధించింది.

కథువా కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

By

Published : Jun 10, 2019, 5:35 PM IST

Updated : Jun 10, 2019, 6:53 PM IST

కథువా కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు.

జమ్ము కథువాలోని బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేల్చిన ఆరుగురికి శిక్షలు ఖరారు చేసింది పఠాన్​కోట్​ ప్రత్యేక న్యాయస్థానం. వీరిలో ముగ్గురు ప్రధాన నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు.

ప్రధాన నిందితులు సంజీరామ్​, దీపక్​ ఖజురియా, పర్వేశ్​ కుమార్​లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించింది.
సాక్ష్యాధారాలు మాయం చేసి నిందితులకు సహకరించిన ఎస్​ఐ ఆనంద్​ దత్తా, హెడ్​ కానిస్టేబుల్​ తిలక్​ రాజ్​, ప్రత్యేక పోలీస్​ అధికారి సురేందర్​ వర్మలకు ఐదేళ్లు చొప్పున జైలు శిక్ష విధించింది.

ఏడాది తర్వాత తీర్పు...

జమ్ముకశ్మీర్ కథువా జిల్లాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యంత పాశవిక అత్యాచారం, హత్య ఘటనపై ఏడాది తర్వాత తీర్పు వెలువడింది.

కోర్టు దోషులుగా నిర్థరించిన వారిలో గ్రామపెద్ద సంజీరామ్‌, ఆయన స్నేహితుడు ఆనంద్‌దత్తా, ఎస్‌.ఐ ఆనంద్‌, హెడ్‌కానిస్టేబుల్‌ తిలక్‌రాజ్‌, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్‌, సురేంద్రవర్మ ఉన్నారు. అయితే సంజి రామ్‌ కుమారుడు విశాల్‌ను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది.

ఈ కేసుకు సంబంధించి జూన్ మొదటి వారంలో విచారణ పూర్తవగా ఇవాళ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఏం జరిగింది..?

గతేడాది జనవరి పదో తేదీన కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించిన దుండగులు ఒక ఆలయంలో ఆ చిన్నారిని బంధించి అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

ఇదీ చూడండి:

కథువా దురాగతం గురించి తెలుసుకోవాల్సినవి...

Last Updated : Jun 10, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details