దేశ రాజధానిలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దాని తీవ్రత 3.5గా నమోదైంది. ఆదివారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించాయి.
రాజధాని ప్రాంతంతో పాటు నోయిడా, గాజియాబాద్, ఫరీదాబాద్‌లలో భూమి కంపించింది. సుమారు 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికార వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో.. ప్రకంపనలు సంభవించడం వల్ల అందరూ బయటకు పరుగులు తీశారు.