కేరళ ఎర్నాకులంలో దారుణం జరిగింది. 75 ఏళ్ల బామ్మ మీద అత్యంత పాశవికంగాా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో 66 సంవత్సరాల మహిళ కూడా ఉంది.
తీవ్రంగా గాయపడిన బాధితురాలికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. ఆమె ఛాతీ, పొట్ట, మర్మాంగాల వద్ద తీవ్ర గాయాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. శరీర అంతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నాయని పరీక్షల్లో తేలింది.
నిందితుల ఇంట్లోనే..
అరెస్టయిన మహిళ ఓమనకు చెందిన ఇంట్లోనే బామ్మపై లైంగికదాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఓమన, బాధితురాలు ఇద్దరు స్నేహితురాళ్లు. ఓమన ఇంటికి బాధితురాలు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి మానసిక సమస్యలు, జ్ఞాపక శక్తి లోపం కూడా ఉందని తెలుస్తోంది.