తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2,896 శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీ'

70 ప్రముఖ సంస్థలు, ప్రయోగశాలల్లో 2,896 శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని సైన్స్​ అండ్​ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు.

'2వేల 896 శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీ'

By

Published : Jul 12, 2019, 11:44 PM IST

సైన్స్​ అండ్​ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 70 ప్రముఖ సంస్థలు, ప్రయోగశాలల్లో 2,896 శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి హర్షవర్ధన్​ లోక్​సభకు అందించిన లిఖితపూర్వ సమాధానంలో వెల్లడించారు.

నేషనల్​​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓషనోగ్రఫి- గోవా, ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ- హైదరాబాద్​, నేషనల్​ కెమికల్​ లేబొరేటరీ-పుణె, ఫోర్త్​ పారడిమ్​ ఇన్​స్టిట్యూట్​- బెంగళూరు, సెంట్రల్​ ఫ్లడ్​ టెక్నాలజికల్​ రీసర్చ్​ ఇన్​స్టిట్యూట్​- మైసూరు వంటి ప్రముఖ సంస్థల్లో 100కుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు హర్షవర్ధన్​ తెలిపారు.

సైన్స్​ అండ్​ టెక్నాలజీ మంత్రిత్వశాఖలో 3 విభాగాలు (కౌన్సిస్​ ఫర్​ సైన్స్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసర్చ్, డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ, డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయోటెక్నాలజీ​) ఉన్నాయి.

ఇదీ చూడండి:- ముహూర్తం కోసం నీళ్ల రైలుకు రెడ్​ సిగ్నల్!

ABOUT THE AUTHOR

...view details