ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 27 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు. అందులో ఐదుగురిపై నగదు రివార్డు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు చేపట్టిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులవటం సహా.. మావోయిస్టు భావజాలంతో విసుగు చెంది లొంగిపోయారని పేర్కొన్నారు.
" కొత్తగా ఆరుగురు మహిళలు సహా మొత్తం 27 మంది నక్సలైట్లు బార్సూర్ పోలీస్ స్టేషన్లో సీనియర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ ఆధికారుల ఎదుట లొంగిపోయారు. అందులో 11 మంది మావోయిస్టులు గుఫా, ఏడుగురు బెడ్మా, ఐదుగురు మంగ్నార్, ముగ్గురు హితవాడ, ఒకరు హండ్వాడా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించాం. వారంతా పోలీసు బృందాలపై దాడులు, ఐఈడీలు పేల్చటం, మావోయిస్ట్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయటం వంటి నేరాల్లో పాలుపంచుకున్నారు. అందులో ఐదుగురిపై రూ.1 లక్ష రివార్డు కూడా ఉంది. తక్షణ సాయం కింద ప్రతిఒక్కరికి రూ. 10 వేల నగదు అందించాం. ప్రభుత్వ పునరావాస పాలసీ ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం."