తెలంగాణ

telangana

ETV Bharat / bharat

14 ఏళ్ల తర్వాత స్వగ్రామాలకు గిరిపుత్రులు - వలసలు

స్వరాష్ట్రమైన ఛత్తీస్​గఢ్​ నుంచి 14 ఏళ్ల క్రితం వలసపోయిన 25 గిరిజన కుటుంబాలు మరలా సుక్మా జిల్లాలోని తమ స్వగ్రామాలకు చేరుకున్నాయి. ఇంతకు ముందు ఈ కుటుంబాలు.. మావోయిస్టులు, పోలీసు దళాల మధ్య పోరాటంలో నలిగిపోయి, పొరుగురాష్ట్రాలకు వలసపోయాయి.

14 ఏళ్ల తర్వాత స్వగ్రామాలకు చేరిన గిరిపుత్రులు

By

Published : May 18, 2019, 8:16 PM IST

Updated : May 18, 2019, 8:44 PM IST

14 ఏళ్ల తర్వాత స్వగ్రామాలకు గిరిపుత్రులు

మావోయిస్టులు, పోలీసుల మధ్య పోరాటంలో వారు బలిపశువులయ్యారు. ఉన్న ఊరిని విడిచిపెట్టి, కన్నీళ్లతో పరాయి రాష్ట్రాలకు వలసపోయారు. పరిస్థితులు కొంత సద్దుమణగడం వల్ల 14 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత మరలా తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారే ఛత్తీస్​ఘడ్​ సుక్మా జిల్లా ఆదివాసీలు.

మావోయిస్టులను ఎదుర్కోవడానికి పోలీసులు గిరిజన యువకులతో సల్వాజుడం దళాన్ని ఏర్పరిచారు. మావోయిస్టులకు, సల్వాజుడం దళాలకు మధ్య జరిగిన పోరాటంలో అమాయకులైన గిరిపుత్రులు బలయ్యారు. ఆ రక్తపాతాన్ని భరించలేక బస్తర్​ ప్రాంతంలోని కొన్ని వేల మంది ఆదివాసీలు కన్నతల్లి లాంటి సొంత ఊరిని విడిచిపెట్టి పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఒడిశాలకు వలస పోయారు.

14 ఏళ్ల తర్వాత స్వగ్రామాలకు చేరుకున్న గిరిజన కుటుంబాలు

14 ఏళ్ల వనవాసం తర్వాత... సొంత గూటికి

కొన్ని ఆదివాసీ సంఘాల కృషితో... 14 ఏళ్ల తరువాత 25 గిరిజన కుటుంబాలు మరలా తమ స్వగ్రామమైన సుక్మా జిల్లాలోని మరైగూడ గ్రామానికి చేరుకున్నాయి. వీరు ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలో తలదాచుకున్నారు.

అయితే ఈ గిరిపుత్రుల జీవనం ఇకనైనా సాఫీగా సాగుతుందన్న భరోసా లేదు. చాన్నాళ్లుగా గ్రామాలు విడిచివెళ్లిపోవడం వల్ల వారి భూములు, పాడిపశువులు ఆక్రమణకు గురయ్యాయి. మావోయిస్టుల భయమూ పొంచి ఉంది. వారికి ఎలాంటి ఆర్థిక చేయూతా లేదు. అందుకే ఇప్పటికీ చాలా గిరిజన కుటుంబాలు తమ సొంత ఊరు వెళ్లడానికి సుముఖంగా లేవు.

స్వగ్రామాలకు చేరుకున్న గిరిపుత్రులు

మేమున్నాం..

స్వగ్రామాలకు తిరిగివచ్చిన గిరిపుత్రులకు తాము అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

గిరిజనులకు పునరావాసం

"సుక్మా జిల్లాలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు అనేక కారణాల రీత్యా వేరే ప్రదేశాలకు వలస వెళ్లిపోయారు. వారిలో కొంతమంది తిరిగి వారి స్వగ్రామలకు వచ్చి నివాసం ఉండాలనుకుంటున్నారు. వారికి అన్ని విధాలా సహకరించాలని, రక్షణ కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించాం. వారందరికీ పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం."- సుందర్​రాజ్​, డిప్యూటీ ఇన్స్​పెక్టర్​ జనరల్ ఆఫ్​ పోలీస్​

ఇదీ చూడండి: రేపటి వరకు యోగముద్రలోనే 'మోదీ బాబా'

Last Updated : May 18, 2019, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details