దేశవ్యాప్తంగా ఉన్న 25శాతం ఆరోగ్య సిబ్బందిలో కొవిడ్-19 సెరోపాజిటివిటీ (యాంటీబాడీల వృద్ధి) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయక మంత్రి అశ్విని చౌబే తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఎంతమంది ఆరోగ్యసిబ్బంది కరోనా బారిన పడ్డారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు.
కరోనా దేశవ్యాప్తంగా ప్రభావం చూపటం వల్ల విడిగా ఆరోగ్య కార్యకర్తల వివరాలు ప్రభుత్వం సేకరించలేదు. కానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన మూడో విడత సెరో సర్వేలో (డిసెంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్యలో చేసిన సెరో సర్వే) 25.7శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు గుర్తించినట్లు వెల్లడించారు.
---- అశ్విని చౌబే, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి