రాజస్థాన్ బుందీ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి మేజ్ నదిలోకి దూసుకెళ్లింది. కోటా- దౌసా హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో24 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.
ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే!
28 మందితో కూడిన పెళ్లి బృందంతో బస్సు కోటా నుంచి సవాయి మాదాపుర్ వెళుతుండగా.. పాప్డి సమీపంలోని వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రపోవటం కారణంగా బస్సు అదుపుతప్పి వంతెన ప్రహరీని ఢీకొట్టి నదిలోకి దూసుకుపోయింది.
10 మంది మహిళలు..
ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే చనిపోగా.. 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇందులో చాలామందిని స్థానికులే ఆసుపత్రికి తరలించారు.