తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగుపాటుకు ఒక్కరోజులో 83 మంది బలి - 22 people killed due to thunderstorms in Bihar in the last 24 hours

storm
పిడుగుపాటుకు ఒక్కరోజులో 83 మంది బలి

By

Published : Jun 25, 2020, 3:01 PM IST

Updated : Jun 25, 2020, 7:34 PM IST

14:57 June 25

పిడుగుపాటుకు ఒక్కరోజులో 83 మంది బలి

బిహార్​లో ఒక్కరోజులో పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. అసమ్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఔరంగాబాద్​లో ఇద్దరు, బక్సర్​లో ముగ్గురు, నలందలో ఇద్దరు, జుమ్రుయిలో ఒక్కరు సహా 83మంది పిడుగుపాటుకు బలయినట్లు తెలిపింది.

బిహార్​లో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించింది వాతావరణ శాఖ.

రూ.4 లక్షల పరిహారం..

పిడుగుపాటుతో 83మంది మృతి చెందడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు. 

Last Updated : Jun 25, 2020, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details